నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి | Maoist leader jampanna mother | Sakshi
Sakshi News home page

నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి

Sep 16 2014 1:02 AM | Updated on Sep 2 2017 1:25 PM

నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి

నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి

‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు.

బూర్గంపాడు: ‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు. సోమవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సారపాకకు చెం దిన జినుగ నవీన్‌రెడ్డి (జంపన్న అన్న వెంకటరెడ్డి కుమారుడు) స్పందించారు. సోమవారం రాత్రి తన తల్లి కళావతితో కలసి ‘సాక్షి’తో మాట్లాడాడు. ‘వృద్ధాప్యంలో ఉన్న మా నానమ్మను చూసుకునేందుకు నేనున్నా. సారపాకలోని ఐటీసీలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నాను.

మానాన్న కొంతకాలం క్రితం చనిపోయారు.ఏడాది క్రితం మా నానమ్మ నా పెళ్లికి వచ్చింది. ఇక్కడ ఉండమని ఎంత బతిమాలినా వినలేదు. ఆ తర్వాత కనిపించలేదు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని చూశాక మా నానమ్మ ఆచూకీ తెలిసింది. మా నానమ్మ మంచి చెడులు చూసుకునేందుకు నేను, మా అమ్మ ఉన్నాం.’ అని అన్నాడు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement