కూలిన వినాయకుడి మండపం 

Ganesh idol collapses In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  వినాయక చవితి పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహం ఏర్పాటులో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గణనాథుడి మండపం కుప్పకూలిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది.సెప్టెంబర్‌ 2న వినాయక చవితి సందర్భంగా నాతయ్యపాలెంలో 70 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అతి పెద్ద మండపాన్ని నిర్మించి అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు.

ఇందుకోసం గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలితో పాటు భారీ వర్షం కారణంగా మండపం పేకపేడలా కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.15 లక్షలతో నెల రోజులుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top