ప్రశాంతి నిలయంలో అగ్ని ప్రమాదం | fire accident in puttaparthi | Sakshi
Sakshi News home page

ప్రశాంతి నిలయంలో అగ్ని ప్రమాదం

Nov 28 2013 3:01 AM | Updated on Sep 5 2018 9:45 PM

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో ఉన్న స్టోర్ గదిలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

పుట్టపర్తి, న్యూస్‌లైన్: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో ఉన్న స్టోర్ గదిలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సత్యసాయి వేడుకల సందర్భంగా అలంకరణకు ఉపయోగించిన సామగ్రిని నిల్వచేసిన గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్లాస్టిక్ సామగ్రికి నిప్పంటుకుంది. సేవాదళ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement