ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం | bus burnt by accident | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం

May 4 2015 3:34 PM | Updated on Sep 5 2018 9:45 PM

కడప జిల్లాలోని విజయదుర్గా కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తూ బస్సు దగ్ధమైంది.

కడప : కడప జిల్లాలోని విజయదుర్గా కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైంది. నగరంలోని విజయదుర్గాకాలనీలో ఉన్న వెల్డింగ్ షాప్‌లో మైదకూరుకు చెందిన వీఆర్ కాలేజీ బస్సుకు వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తుండగా  అగ్ని ప్రమాదం సంభవించింది.

 

దీంతో బస్సుకు నిప్పంటుకుని కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో వెల్డింగ్ చేస్తున్న మెకానిక్ మహబూబ్ బాషాకు స్పల్ప గాయాలయ్యాయి. మెకానిక్  షెడ్ పూర్తిగా కాలిపోయింది. కాగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement