‘నేను విన్నాను... నేను ఉన్నాను’... అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా విలువేమిటో తొలి వార్షిక బడ్జెట్ తెలియజెప్పింది. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. పార్టీలు అసలే లేవు.. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి.. మాత్రమే సర్కారు లక్ష్యమని బడ్జెట్ ప్రతిపాదనలు రుజువుచేశాయి.