టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌ని ఓడించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు ఏమి చర్చించలేదు.