శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ నరసింహన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉ. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి.