కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు.