పార్టీ ఫిరాయించి ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.