ఏడు రోజులుగా దీక్ష కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు ఆయన సతీమణి భారతికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తొలుత అనుమతి నిరాకరించినా, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేవలం భారతికి మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే జగన్‌కు.. వైఎస్ భారతి సాయంగా ఉండొచ్చని తెలిపింది. ఆస్పత్రిలో ఉన్నంత కాలం ఆ వేళల్లో జగన్‌కు ఆమె సాయంగా ఉండొచ్చని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతి నిమ్స్కు చేరుకున్నారు. కాగా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని కోరుతూ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనకు సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ సతీమణి.భారతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జగన్ తల్లి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారణ చేపట్టి, విచారణను నేటికి వాయిదా వేశారు. ఈ పిటిషన్ నిమిత్తం భారతి శుక్రవారం స్వయంగా కోర్టుకు హాజరై విజ్ఞప్తి చేశారు.