
పెట్టుబడులకు సొమ్ములు లేక..
ఈసారి రబీ సాగులో రైతులకు అతి పెద్ద కష్టం పెట్టుబడికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి రావడం. కోతల సమయంలో ఖరీఫ్ పంట వర్షాల బారిన పడింది. దీనికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల మేర పెట్టుబడి సాయం ఇస్తామని గొప్పగా చెప్పారు. కానీ, నయాపైసా ఇవ్వలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధి రూ.6 వేలతో కలిపి ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా అందించేది. ఈసారి పీఎం సమ్మాన్ నిధి రూ.6 వేలు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ఇస్తాన్న రూ.14 వేలు అందించలేదు. దీంతో పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది.
రైతుకు ఆర్థిక సాయం చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో రూపొందించిన చిత్రం

పెట్టుబడులకు సొమ్ములు లేక..