ప్రధాన వార్తలు
బరితెగించిన టీడీపీ వర్గీయులు
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయతి్నంచినా వారు శాంతించలేదు. మీ అంతు తేలుస్తామంటూ వైఎస్సార్సీపీ వర్గీయులను బెదిరించారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 👉 రాయచోటి అసెంబ్లీ పరిధిలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. 👉 మదనపల్లి బీటీ కళాశాల పోలింగ్ బూత్‌లోకి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా దూసుకుని వచ్చింది. 👉 లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ చౌటుపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 👉లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఇరుపారీ్టల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. 👉 కేవీపల్లె మండలం జిల్లేల్లమంద పంచాయతీ దేవాండ్లపల్లె పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 👉లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లె పోలింగ్ బూత్‌లో ఇరువురు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. 👉 రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం దూలవారిపల్లి పోలింగ్ స్టేషన్ నంబర్ 85లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. 👉 రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలో పోలింగ్ బూత్ నంబర్ 110. 111లో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. 👉మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు
May 14th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 14th AP Elections 2024 News Political Updates06:06 PM, May 14th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు06:00 PM, May 14th, 2024వైఎస్సార్సీపీ గెలుపు కోసం చెమటోడ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మన YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను. -సీఎం వైఎస్ జగన్నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024 05:50 PM, May 14th, 2024అనంతపురం:తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతవైఎస్సార్ సీపీ నేతలపై దాడికి యత్నించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవైఎస్సార్సీపీ - టీడీపీ వర్గాల మధ్య ఘర్షణపరస్పరం రాళ్ల దాడి,ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుబాష్పవాయువు ప్రయోగించిన పోలీసులురాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలు03:50 PM, May 14th, 2024విజయవాడసీఈవో ఎంకే మీనాతో మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతల భేటీపల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదునిన్న జరిగిన ఘటనలు చాలా దారుణం: మంత్రి అంబటి రాంబాబుపల్నాడు జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరించారుటీడీపీ నాయకులు ప్రజల పై దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదుకొత్త గణేశునిపాడు లో మహిళలపై టీడీపీ నేతలు దాడి చేశారుమహిళలు గుడిలో దాక్కుంటే టీడీపీ నేతలు దాడులు చేశారుఅనిల్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి పరమర్శకి వెళితే వల్ల కార్ల పై దాడికి యత్నించారుపోలీసులు ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి టీడీపీ నేతలు కల్పించారునా నియోజకవర్గంలో 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశారువాటిలో రీ పోలింగ్ చెయ్యాలని కోరాంవెబ్ కాస్టింగ్ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరాంనిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడే మేము ఫిర్యాదు చేశాంకన్నా లక్ష్మీనారాయణ రాడ్లు, కర్రలతో మనుషులను దించారుపల్నాడులో పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారుప్రజల ప్రాణాలు కాపాడమంటే పోలీసులు స్పందించడం లేదు 02:24 PM, May 14th, 2024మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిఓటమి భయంతోనే జేసీ సోదరులు తమపై రాళ్ల దాడులకు పాల్పడ్డారుఅడిషనల్ ఎస్పీ రామకృష్ణ టీడీపీ నాయకులకు తొత్తుగా మారారురామకృష్ణపై ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం02:02 PM, May 14th, 2024ఓటమి భయంతోనే టీడీపీ నేతల దాడులు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిటీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరినియోజకవర్గంలో వార్ వన్ సైడ్‌గా ఉందని.. చింతమనేని కనుసనల్లో గ్రామాల్లో దాడులక పాల్పడ్డారు.ఒక రౌడీ షీటర్‌కి బీఫామ్ ఇచ్చి దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు అరాచకాలు నిద్రలేపాడువైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతుందని వారు జీర్ణించుకోలేకపోతున్నారువైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా కర్రలు, కత్తులతో దాడులు చేశారుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రౌడీయిజంతో గెలవలనుకున్నాడుదెందులూరు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిందిరానున్న ఫలితాల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలవబోతోందిఈ సారి టీడీపీకి 23 సీట్లు కూడా రాని పరిస్థితి ఉందిదెందులూరులో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ జెండా ఎగర వేయబోతున్నాం01:32 PM, May 14th, 202481 శాతం పోలింగ్ నమోదు కావచ్చు: ఏపీ సీఈవోమీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్ చాట్కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదుఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా1.2శాతం పోస్టల్ బ్యాలెట్ తో 79.4 శాతం నమోదు.మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయిమా అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చురాత్రి 12 తర్వాత కూడా కొనసాగిన పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశాంసుమారు 20 కేంద్రాల్లో కొత్త ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించాం.01:15 PM, May 14th, 2024మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు: మంత్రి అంబటి రాంబాబుఉదయం 6గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగిందిఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నికచంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగిందిమహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారుతమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారుఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి ఓటు వేశారుఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారుమహిళలు 70శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారుఅమ్మఒడి, ద్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేసారుఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదుజగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించిందిచంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైసీపీ వైపే ఉన్నారుసత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీ తో గెలవబోతున్నానుఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగిందిడీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారుఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదులా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదుగొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదుపోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారుదాడులు జరిగిన తర్వాత చాలసేపటికి పోలీసులు వచ్చారునకిరేకల్ ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారుఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారుకానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారుకన్నా కుమారుడు మీ అంతు తేల్చుతా అని ఓటర్లను బెదిరించారురూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడుటీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడుదమ్మాలపాడు బూత్ లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారుఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసానురీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నానునా అల్లుడు ఉమేష్ కారు పై దాడి చేశారుచీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదుఎలక్షన్ కమిషన్ ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నానుకొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారుఎవరి ఓటు వాళ్ళు వేస్తే సమస్య లేదుఅందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అధారిటీస్ కి ఫిర్యాదు చేసానుచంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడుఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నెరవేర్చిన మొనగాడు జగన్మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు 11:37 AM, May 14th, 2024జమ్మలమడుగులో బీజేపీ, టీడీపీ నేతల గూండాగిరిపట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 116,117లో బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి.. వాహనంపైనా దాడిబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిల డైరెక్షన్లో దాడిరౌడిల్లా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిపోలీసులు అడ్డుపడినా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైకి దూసుకొచ్చిన కడప టిడిపి ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిఅడ్డుపడిన పోలీసులపై భూపేష్ గూండాగిరి10:57 AM, May 14th, 2024టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు.. అనిల్‌కుమార్ ఆగ్రహంపల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందికొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారుటీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదుఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారుమాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారుపిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారుపోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారుపల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదుపోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారుకొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారునన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు 10:50 AM, May 14th, 2024కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంచంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంసర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలుసర్పంచ్ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసంకూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు 9:43 AM, May 14th, 2024జేసీ కుటుంబంపై కేసు..టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులుపోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలుఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలుఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు9:20 AM, May 14th, 2024రెచ్చిపోయిన జనసేనకోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలుకపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగంవైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులుఅర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణలీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు8:41 AM, May 14th, 2024పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలుతమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలుసత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసంగురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసంకర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడిపోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులుకొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసంసీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు7:48 AM, May 14th, 2024పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనాఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లుఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులుసా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనాపలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్‌చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుహింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదుఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్ కోరుతూ అభ్యర్థనలు రాలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా7:32 AM, May 14th, 2024పచ్చ ముఠాల విధ్వంస కాండఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలురాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతంయథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేనచంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచనఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనతశ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లువైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలుఅన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజంవైఎస్సార్ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసంజంగాలపల్లి పోలింగ్ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలుచిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసంకోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు 7:30 AM, May 14th, 2024పల్నాట పచ్చ మూక బీభత్సకాండఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులుమాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడితంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలుపాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసంముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసంనూజెండ్ల మండలంలో దళితులపై అరాచకంకేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు 7:24 AM, May 14th, 2024ఆగని టీడీపీ అరాచకాలు దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలుగణబాబు, శ్రీభరత్ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీఅడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులుపోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్‌సీపీ ఏజెంట్ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ7:15 AM, May 14th, 2024ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లుఅడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలుసీఎం రమేష్ ఓవరాక్షన్.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారంటీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర 7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్ సునామీ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్.. 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు
చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్
ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది.. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 10న తీర్పు వెలువరించింది.పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. పోలీసులపై చంద్రబాబు దాడి ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది.మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్ సరి్టఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఇదీ.. 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్‌కు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్ బాబు దీన్ని అడ్డుకోవడంతోపాటు తెలుగు, ఇంగ్లి‹Ùలో పోలీసు అధికారులను దూషించారు.అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతోపాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికిచి్చన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించింది.నిబంధనల ప్రకారమే కేసులు: ధర్మాసనం అంతకుముందు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మేజి్రస్టేట్ వెంటనే విడుదల చేశారన్నారు. అయితే, దాడి కేసులో పోలీసులు చంద్రబాబును, నక్కా ఆనంద్ బాబును ఇరికించారని ఆరోపించారు. జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందన్నారు.ప్రస్తుత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీనియర్ జైలర్ అని, ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది. జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి జైళ్ల చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వీడియోలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..
అక్కడ రీ-పోలింగ్ ?
పిఠాపురం ప్రజలంతా సీఎం జగన్ వైపు..