‘‘మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. అర్థరాత్రి సమయంలో ఓ దెయ్యం పిల్లాడు, చిన్న కుక్కపిల్లతో మా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అది మా ఇంట్లోని సీసీకెమెరాల్లో రికార్డైంది’’ అంటూ భయపడిపోతున్నాడు అమెరికాకు చెందిన జోయ్ నోలన్ అనే వ్యక్తి. ఇందుకు రుజువుగా ఆగస్టు 8న తన ఇంటి కిచెన్ దగ్గర చోటుచేసుకున్న సీసీటీవీ దృశ్యాలను చూపెడుతున్నాడు. జోయ్ నోలాన్ తెలిపిన వివరాల మేరకు.. లాంగ్ ఐలాండ్‌కు చెందిన జోయ్ నోలాన్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయాల్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించేది. దీంతో కొద్దిరోజుల క్రితం అతడు తన ఇంటి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి చూశాడు. ఆగస్టు 8నాటి సీసీటీవీ దృశ్యాలను చూడగానే అతడి ఒళ్లు జలదరించింది. రెండు వింత ఆకారాలు ఇంట్లో అటు ఇటు పరిగెత్తడం అతడి కంటపడింది.
మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి
Aug 23 2019 12:55 PM | Updated on Aug 23 2019 1:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement