ఓ పోలీసు అధికారికి వివాహం నిశ్చయమయ్యింది. వేడుకలో భాగంగా భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నాడు. పోలీసు కదా అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎన్నుకున్నాడు. దానిలో భాగంగా.. సదరు అధికారి హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో తనకు కాబోయే భార్యను ఆపుతాడు. హెల్మెట్ లేదు.. ఫైన్ కట్టాలని చెప్తాడు. అప్పుడామే తనకు కాబోయే భర్త, సదరు అధికారి జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. అలా వెళ్తూ తన భర్త జేబులో నుంచి వాలెట్ కొట్టేస్తుంది. ఇది గమనించిన అధికారి తన వాలెట్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెను కలుసుకుంటాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ కాన్సెప్ట్‌తో తీసిన వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ స్నేహితులకు, బంధువులకు విపరీతంగా నచ్చింది. దాంతో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. నెటిజనులకు ఈ వీడియో తెగ నచ్చింది.
అధికారి కొంప ముంచిన ప్రీ వెడ్డింగ్ వీడియో
Aug 27 2019 3:21 PM | Updated on Aug 27 2019 3:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement