ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల పోటీలు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల పోటీలు

Published Sat, Dec 2 2023 12:56 AM

- - Sakshi

మాటలు రావని.. కనిపించదని.. వినిపించదని మమ్మల్ని చూసి జాలిపడకండి. మాలో ఉన్న ప్రతిభను గుర్తిస్తే చాలు.. మేము ఎందులోనూ తక్కువ కాదంటూ తమ ప్రతిభను ప్రదర్శించారు విభిన్న ప్రతిభావంతులు. శుక్రవారం ఏలూరులో జరిగిన ఆటల పోటీల్లో పెద్ద ఎత్తున విభిన్న ప్రతిభావంతులు పోటీపడ్డారు. త్రో బాల్‌, జావెలిన్‌ త్రో, 100 మీటర్ల పరుగు, డిస్కస్‌ త్రో లాంటి క్రీడల్లో పాల్గొని సత్తా చాటారు. ఒకరికొకరు సహాయపడుతూ తమవారిని పోటీలు జరిగే ప్రాంతానికి తీసుకొచ్చారు. ఈ పోటీలు చూసేందుకు వచ్చిన విద్యార్థులు పోటీదారులను ఉత్సాహపరిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ఆటల పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

– ఏలూరు రూరల్‌

ట్రై సైకిల్‌ విభాగంలో పోటీపడుతూ ..

Advertisement
Advertisement