No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 11 2023 12:12 AM

- - Sakshi

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ఆయకట్టు కింద యాసంగి పంటకు క్రాఫ్‌ హాలీడే ప్రకటించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలంలో నీటిమట్టం పడిపోవడం వల్ల మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి అవసరాల కోసం కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నీటిని వినియోగించడానికి యాసంగి పంటలకు నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే కోయిల్‌సాగర్‌ ఆయకట్టు రైతులకు సూచించారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌కు జూరాల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల చేస్తు వచ్చారు. వర్షాలు సరిగా కురవకపోయినా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగుల వరకు చేరింది. గత వానాకాలంలో సైతం జూరాల నీటిని విడుదల చేస్తూ.. మరోపక్క కాల్వల ద్వారా పంటలకు నీటిని వదిలారు. అయితే గత నవంబర్‌ చివరి వారంలో నీటి విడుదల నిలిపివేసి కేవలం ప్రాజెక్టును నింపుతూ వచ్చారు.

కోయిల్‌సాగర్‌ కింద క్రాప్‌ హాలీడే

పంటలు సాగు చేయొద్దు..

కోయిల్‌సాగర్‌ ఆయకట్టు కింది రైతులు యాసంగి పంటలు వేసుకోవద్దు. గత సీజన్‌ చివరలోనే యాసంగి పంటలు సాగు చేయొద్దని రైతులకు చెప్పాం. ప్రాజెక్టులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ఉపయోగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయకట్టు రైతులు ఈ విషయం గమనించి సహకరించాలి. – ప్రతాప్‌సింగ్‌, కేఎస్పీ ఈఈ

Advertisement

తప్పక చదవండి

Advertisement