బాలల హక్కులపై అవగాహన | Sakshi
Sakshi News home page

బాలల హక్కులపై అవగాహన

Published Wed, Nov 22 2023 1:12 AM

మాట్లాడుతున్న బాలల సంరక్షణ అధికారి 
సురేందర్‌  - Sakshi

వనపర్తిటౌన్‌: బాలలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని బాలల సంరక్షణ అధికారి సురేందర్‌ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 18 ఏళ్లలోపు వారంతా బాలలేనని తెలిపారు. ఐక్యరాజ్య సమితి బాలలకు నాలుగు ప్రధాన హక్కులు కల్పించిందని.. అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, అభివృద్ధి చెందే హక్కులని వివరించారు. మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సోషల్‌ వర్కర్‌ నరేందర్‌, ప్రిన్సిపాల్‌ బెన్నీ జోసెఫ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement