18 ఆటోలపై కేసుల నమోదు | Sakshi
Sakshi News home page

18 ఆటోలపై కేసుల నమోదు

Published Fri, Dec 1 2023 1:00 AM

-

గోపాలపట్నం: స్కూల్‌ ఆటోలపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆటోలపై కేసులు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఎన్‌ఏడీ, దువ్వాడ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 18 ఆటోలపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు నగరంలో పలు చోట్ల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో 169 ఆటోలపై కేసులు నమోదు చేసినట్టు ఉపరవాణా కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. తనిఖీల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు బుచ్చిరాజు, హరిప్రసాద్‌, బాలిజీ రావు, సుమన్‌ కుమార్‌, శిరీషా, శిరీషాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

గృహిణులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో ఉచిత శిక్షణ

సీతంపేట: గృహిణులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గృహిణి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దామోదర మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రామాటాకీస్‌ సమీపంలో కెనరా బ్యాంకు ఎదురుగా శ్రీకృష్ణ ట్రావెల్స్‌ మేడ మీద ఉన్న సంస్థ కార్యాలయంలో ఈనెల 4 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల గృహిణులు ఇనిస్టిట్యూట్‌కి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8019388999 నంబరుకు సంప్రదించాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement