ఓటర్ల నమోదుకు కొత్త వెబ్‌సైట్‌ | New website for voter registration | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదుకు కొత్త వెబ్‌సైట్‌

Mar 28 2023 2:41 AM | Updated on Mar 28 2023 5:43 AM

New website for voter registration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న నేషనల్‌ ఓటర్‌ పోర్టల్‌ సర్వీస్‌(ఎన్వీపీఎస్‌) వెబ్‌సైట్‌కి బదులు ‘ఓటర్స్‌’పేరుతో కొత్త వెబ్‌సైట్‌ ( https:// www.voters.eci.gov.in  )ను అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ప్రకటించారు.

కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, జాబితా నుంచి పేరు తొలగింపు, చిరునామా మార్పు వంటి అవస­రాలకు 6, 6ఏ, 7, 8 వంటి ఫారాలను వినియోగిస్తూ ఇకపై కొత్త వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పాత వెబ్‌సైట్‌ ఇక పనిచేయదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విశిష్ట రిఫరెన్స్‌ నంబర్‌ను ఎస్‌ఎంఎస్, మెయిల్‌ ద్వారా దరఖాస్తుదారులకు పంపిస్తామన్నారు.

ఈ నంబర్‌ ద్వారా దరఖాస్తు స్థితిగతులను తెలుసుకోవచ్చు అన్నారు. కొత్త పోర్టల్‌ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చని, ఓటరుగుర్తింపు కార్డుకోసం, ఓటరు కార్డులో మార్పులకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు ఏ పోలింగ్‌ బూత్, శాసనసభ, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాడు అన్న వివరాలు సైతం తెలుసుకోవచ్చు అని వెల్లడించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్వో)ల వివరాలను సైతం తెలుసుకోవచ్చని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement