KTR: కేటీఆర్‌కు ఊరట | Big Relief For KTR In Telangana High Court In Case Over Comments On CM, More Details Inside | Sakshi
Sakshi News home page

KTR: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

Mar 19 2025 3:32 PM | Updated on Mar 19 2025 3:49 PM

Big Relief For KTR in Telangana High Court

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎంపై చేసిన వ్యాఖ్యల కేసును కొట్టేస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్‌ మాట్లాడారంటూ ఎంపీ అనిల్‌ సైఫాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు కేసును కొట్టేస్తూ కేటీఆర్‌కు ఊరట ఇచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement