బెంజ్‌ మూవీలో జయం రవి | - | Sakshi
Sakshi News home page

బెంజ్‌ మూవీలో జయం రవి

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 7:37 AM

తమిళసినిమా: నటుడు రవిమోహన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. జయం చిత్రం నుంచి తనీ ఒరువన్‌ వరకు పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న నటుడు ఈయన. ఇటీవల విలక్షణ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలా శివకార్తికేయన్‌ హీరోగా నటించిన పరాశక్తి చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌ కలిగిన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తనకు విడాకులు వచ్చే వరకు నటించనని మీడియా సమావేశంలో రవిమోహన్‌ పేర్కొన్నారు. అలాంటిది ఆయన షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. తాజాగా రవిమోహన్‌ బెంచ్‌ అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ ఫాహత్‌ పాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ పతాకంపై సుదన్‌ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రవిమోహన్‌ ఈ చిత్రంలో వైవిద్యభరిత కథా పాత్రలో నటిస్తున్నారని నిర్మాత సుదన్‌సుందరం పేర్కొన్నారు. ఇంతకుముందు కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈయన బెంజ్‌ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. బెంచ్‌ మల్టీస్టారర్‌ చిత్రంగా రూపొందుతోందని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

బెంజ్‌ షూటింగ్‌లో రవిమోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement