నాదా.. సై! | Sakshi
Sakshi News home page

నాదా.. సై!

Published Thu, Apr 18 2024 10:45 AM

 సేలం వ్యూ  - Sakshi

పంతం నీదా..
ఆధ్యాత్మికత, కళలు, చారిత్రాత్మక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన తంజావూరులో ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. తన సొంత గడ్డలో వరుస విజయాలతో దూసుకొచ్చిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి ఎస్‌ఎస్‌ పళణి మాణిక్యాన్ని కాదని కొత్త వ్యూహాలకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పదును పెట్టారు. కొత్త ముఖం అయిన మురసోలిని రంగంలోకి దించారు. ఇక మ్యాంగో నగరంగా ప్రసిద్ధి చెందిన తన సొంత గడ్డ సేలంను దక్కించుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అస్త్రశస్త్రాలను ఒడ్డుతున్నారు. ఇక్కడ యువకుడైన విఘ్నే ష్‌ను అభ్యర్థిగా రంగంలోకి దించారు.
● సొంత గడ్డలో గెలుపు ఎవరిదో..? ● సీఎం స్టాలిన్‌, ప్రతిపక్ష నేత పళణి ఇలాఖాలో ఉత్కంఠభరిత పోరు ● తంజావూరులో డీఎంకే కొత్త వ్యూహాల అమలు ● సేలంలో అస్త్రాలకు పళణి పదును ● గెలుపే లక్ష్యంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటమి కుస్తీ
గప్‌ చుప్‌!
పుదుచ్చేరిలో ఎన్నికలను బహిష్కరించిన అభ్యర్థి
● రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం ● నిఘా కట్టుదిట్టం

సేలం అభ్యర్థులు

అన్నాదురై

(పీఎంకే)

సాక్షి, చైన్నె: ‘తంజావూరు’ పేరు వింటే చారిత్రాత్మక కట్టడాలు, బొమ్మలు, పెయింటింగ్స్‌ వంటి ఎన్నో కళా సంపదలు గుర్తుకొస్తాయి. తెలుగులో వేలాది కీర్తనలను ఆలపించిన సంగీత ప్రియుల ఆరాధ్యుడు త్యాగరాజ స్వామి పుట్టిన గడ్డ కూడా ఇదే. చారిత్రాత్మక గుర్తింపు పొందిన ఈ తంజావూరు గడ్డను ఏలిన వారిలో చోళ, పాండ్య, విజయనగర రాజులు, మదురై, తంజావూరు నాయకర్లు, తంజావూరు మరాఠాలు ఉన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన బృహదీశ్వరాలయం ఇక్కడే కొలువై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర లేఖనానికి, శిల్ప, కళా సంపదకు, కలంకారికి పుట్టినిల్లుగా బాసిళ్లుతున్న ఈ తంజావూరు లోక్‌సభ పరిధిలోని తిరువారూర్‌ జిల్లా డీఎంకే దివంగత నేత కరుణానిధి పుట్టిన గడ్డ. సొంత గడ్డలో సాగుతున్న ఉత్కంఠ సమరంలో తన పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు.

ఎస్‌ఎస్‌కు దక్కని చోటు..

తిరువారూర్‌, తంజావూరు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మేళవింపుతో ఈ లోక్‌సభ నియోజకవర్గం రూపుదిద్దుకుంది. ఇందులో తిరువయ్యారు, తంజావూరు, ఒరత్తనాడు, మన్నార్‌గుడి, పట్టుకోట్టై , పేరావూరని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఈ జిల్లాలను డీఎంకే కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఒక స్థానంలో కాంగ్రెస్‌, ఐదు స్థానాలలో డీఎంకే గెలిచాయి. మన్నార్‌కుడి నుంచి గెలిచిన డీఎంకే కోశాధికారి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత టీఆర్‌ బాలు వారసుడు టీఆర్‌ బీ రాజ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ లోక్‌సభ డీఎంకే కంచుకోట. ఇక్కడి నుంచి ఎస్‌ఎస్‌ పళణి మాణిక్యం ఆరు సార్లు లోక్‌సభలో అడుగు పెట్టారు. తన సొంత గడ్డలో ఈసారి కొత్త వ్యూహాలకు స్టాలిన్‌ పదును పెట్టారు. వరుస విజయాలతో దూసుకొచ్చిన పళణి మాణిక్యంను పక్కన పెట్టారు. కొత్త ముఖంగా తిరుమయం పరిధిలోని తెన్నంకుడి గ్రామానికి చెందిన యువజన నేత మురసోలిని లోక్‌సభ ఎన్నికల తెరమీదకు తెచ్చారు. ఈ స్థానాన్ని మళ్లీ కై వసం చేసుకుని స్టాలిన్‌ పాదాల వద్ద విజయాన్ని సమర్పించేందుకు మంత్రి టీఆర్‌బీ రాజాతో పాటు యువజనులు అంతా ఇక్కడ ఏకమయ్యారు. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం 14,94,216 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,23,787, సీ్త్రలు 7,70,300, ఇతరులు 129 మంది ఉన్నారు. రైతులు, గ్రామీణ ఓటర్లే ఇక్కడ కీలకం. ఈ స్థానంలో డీఎంకే గెలుపును అడ్డుకునేందుకు అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా శివనేషన్‌, బీజేపీ అభ్యర్థిగా సీనియర్‌ నేత కరుప్పు మురుగానందం, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా హుమయూన్‌ కబీర్‌ పోటీ చేస్తున్నారు.

పళణి ఇలాకా మ్యాంగో నగరంలో..

దక్షిణ భారత దేశంలో మ్యాంగో మార్కెట్‌గా పేరుగడించిన సేలం నియోజకవర్గాన్ని కై వసం చేసుకునేందుకు ఈసారి రాజకీయ పక్షాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సొంత గడ్డలో సమరం రసవత్తరంగా మారింది. సేలంను అభివృద్ధి పథంలోకి నడిపించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పవచ్చు. 1952 నుంచి 2004 వరకు జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆతర్వాత ఈ స్థానాన్ని అన్నాడీఎంకే తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. 2019లో ఈ స్థానం డీఎంకే గుప్పెట్లోకి చేరింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ తన సత్తాను అన్నాడీఎంకే చాటుకుంది. ఇక్కడి ఆరు అసెంబ్లీ స్థానాలలో నాలుగింటిని అన్నాడీఎంకే కై వశం చేసుకోగా, డీఎంకే, పీఎంకేలు తలా ఓ సీటును దక్కించుకున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ఎడపాడి అసెంబ్లీ స్థానం నుంచి పళణి స్వామి వరుస విజయాలు సాధించారు. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం జరుగుతున్న తొలి ఎన్నికలో సొంత గడ్డను కై వ,ం చేసుకునేందుకు పళణి స్వామి అస్త్రాలు ఒడ్డుతున్నారు. కొత్త ముఖంగా పి. విఘ్నేష్‌ను తెర మీదకు తెచ్చారు. పళణి స్వామి చరిష్మాతో పాటు పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ఓటర్ల ఆకర్షించడంలో విఘ్నేష్‌ సఫలీకృతడైనా అన్నది వేచి చూడాల్సిందే. ఈ స్థానాన్ని మళ్లీ కై వసం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టిన డీఎంకే సిట్టింగ్‌ ఎంపిని పక్కన పెట్టింది. గతంలో అన్నాడీఎంకే ద్వారా ఇక్కడ ఎంపీగా కూడా గెలిచిన మాజీ మంత్రి, టీఎం సెల్వగణపతిని డీఎంకే అభ్యర్థిగా స్టాలిన్‌ రంగంలోకి దించారు. దీంతో సమరం ఉత్కంఠగా మారింది. ఈ నియోజకవర్గం పరిధిలో తమకు బలం ఉండటంతో పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై మామిడి పండు చిహ్నంతో దూసుకెళ్లారు. నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా మనోజ్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం 16,48,911 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,23,336, సీ్త్రలు 8,25,354, ఇతరులు 221 మంది ఉన్నారు. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థుల కన్నా, డీఎంకే, అన్నాడీఎంకే అధినేతల చరిష్మా కీలకంగా మారడం గమనార్హం. ఈనేపథ్యంలో, ఓటర్ల నాడి తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

తంజావూరు అభ్యర్థులు

తంజావూరు ఆలయం వ్యూ

మురసోలి (డీఎంకే)

తంజావూరు మ్యాప్‌

శివనేసన్‌ (డీఎండీకే)

కరుప్పు మురుగానందం (బీజేపీ)

అన్నాడీఎంకే వర్గాలకు షాక్‌

న్యూస్‌రీల్‌

1/7

సేలం మ్యాప్‌
2/7

సేలం మ్యాప్‌

3/7

 సెల్వగణపతి (డీఎంకే), విఘ్నేష్‌ (అన్నాడీఎంకే),
4/7

సెల్వగణపతి (డీఎంకే), విఘ్నేష్‌ (అన్నాడీఎంకే),

5/7

6/7

7/7

Advertisement
Advertisement