ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి

Published Fri, May 24 2024 12:45 PM

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి

సూర్యాపేటటౌన్‌ : ‘జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి.. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌ కాన్పులు చేస్తే ఆస్పత్రులను అనుమతులు రద్దు చేస్తాం’ అని డీఎంహెచ్‌ఓ కోటా చలం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సిజేరియన్‌ సెక్షన్‌ ఆడిట్‌ కమిటీ సమావేశంలో ఆయన సమీక్షించి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి సిజేరియన్‌ సెక్షన్‌ కాన్పులపై ఆడిట్‌ జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా కడుపుకోత ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రుల నుంచి వివరణ కోరుతామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు నిర్వహించిన సిజేరియన్‌ సెక్షన్‌ కాన్పుల ప్రతి కేస్‌ షీట్‌ను ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రొఫెసర్లు డాక్టర్‌ అమితకుమారి, డాక్టర్‌ దమయంతి క్షుణ్ణంగా పరిశీలించి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమీక్షలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

23 ఎస్‌పిటి 47

డీఎంహెచ్‌ఓ కోటాచలం

Advertisement
 
Advertisement
 
Advertisement