అంగన్‌వాడీల్లో రిటైర్మెంట్లు | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో రిటైర్మెంట్లు

Published Thu, May 23 2024 6:05 AM

అంగన్‌వాడీల్లో రిటైర్మెంట్లు

109మంది గుర్తింపు

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల వివరాలను జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి 65 నిండాల్సి ఉండగా.. పదో తరగతి మెమో, టీసీ, బోనోఫైడ్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఐసీడీఎస్‌ అధికారుల వద్ద ఎంప్లాయ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో వివరాలు సైతం ఉన్నాయి. టీచర్ల వయస్సు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఆయాలు పెద్దగా చదువుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంప్లాయ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో ఉన్న వివరాలకు ఆయాల ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్‌ సర్జన్‌ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అప్పటికే అధికారులు సేకరించిన వివరాల మేరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడి రిటైర్మెంట్‌కు ఐదుగురు టీచర్లు, 104 మంది ఆయాలతో కలిపి మొత్తం 109 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

భానుపురి (సూర్యాపేట): అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65 ఏళ్లు నిండిన టీచర్‌కు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 65 ఏళ్లు నిండిన వారి వివరాలను పంపించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అర్హులైన వారంతా గత నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలస్యమైంది. వచ్చే నెల చివరిలోగా అర్హులైన వారు ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. అయితే రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ చాలా తక్కువగా ఇస్తున్నారని కొందరు నిరాశకు గురవుతున్నారు.

1,206 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో సూర్యాపేట, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,206 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 87 మినీ అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా ప్రధాన సెంటర్లలో టీచర్‌, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్‌ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్‌, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు అంగన్‌వాడీ సెంటర్లలో రిటైర్మెంట్‌ ప్రక్రియ లేకపోవడంతో వయస్సు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేల బెన్‌ఫిట్‌ కల్పిస్తామని ప్రకటించింది.

65 ఏళ్లు నిండిన టీచర్లు,

ఆయాలకు వర్తింపు

వివరాల సేకరణలో

అధికారుల నిమగ్నం

ఇప్పటికే 109 మంది గుర్తింపు

వచ్చే నెల చివరినాటికి

ఉద్యోగ విరమణ ప్రక్రియ పూర్తి

వయస్సు నిర్ధారణలో కొంత

అయోమయం

Advertisement
 
Advertisement
 
Advertisement