source: X
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కని వైభవ్‌కు ఇషాన్ కిషన్ గాయపడటంతో రెండో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలో వైభవ్ బ్యాట్ పట్టకుండానే ఓ ప్రపంచ రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడైన (15 ఏళ్ల 211 రోజులు) పురుష క్రికెటర్‌గా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు మహమ్మద్ షరీఫ్ పేరిట ఉండేది. అతడు 2001లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు 16 ఏళ్ల 6 రోజుల వయసులో ఉన్నాడు. భారత్‌కు సంబంధించి గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ న్యూజిలాండ్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పుడు అతడి వయసు 16 ఏళ్ల 284 రోజులు.
ఓవరాల్‌గా న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కులు (టాప్-5)
15 ఏళ్ల 211 రోజులు: వైభవ్ సూర్యవంశీ (భారత్)
16 ఏళ్ల 6 రోజులు: మహమ్మద్ షరీఫ్ (బంగ్లాదేశ్)
16 ఏళ్ల 185 రోజులు: ఆకిబ్ జావేద్ (పాకిస్థాన్)
16 ఏళ్ల 284 రోజులు: సచిన్ టెండూల్కర్ (భారత్)
17 ఏళ్ల 164 రోజులు: మహమ్మద్ అష్రఫుల్ (బంగ్లాదేశ్)
మూడో స్థానంలో బ్యాటింగ్
ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నట్లు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ సమయంలో వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (70) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. బెవాన్ జాకబ్స్ (58) అతడికి సహకరించాడు. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (2 బంతుల్లో 10 పరుగులు) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో టిమ్ సీఫర్ట్ 7. ఫిన్ అలెన్ 16, డారిల్ మిచెల్ 6, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 4 (నాటౌట్) పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్‌లో 2 వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్ వికెట్ తీయకపోయిన పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఇదీ చదవండి: 1434 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భువీ


