పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal who fought and lost | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌

Jul 25 2024 3:49 AM | Updated on Jul 25 2024 9:51 AM

Sumit Nagal who fought and lost

జెనరాలి ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీనలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం ముగిసింది. ఆ్రస్టియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్‌ సుమిత్‌ 5–7, 5–7తో ప్రపంచ 45వ ర్యాంకర్‌ పెడ్రో మారి్టనెజ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు. 

2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. సుమిత్‌కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 పాయింట్లు లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement