షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్‌ వైరల్‌

Shahid AfridiShahid Afridis Special Post On Daughter Anshas Marriage With Shaheen - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా ఆఫ్రిది వివాహం శుక్రవారం కరాచీ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహీన్ వివాహమాడాడు. వీరిద్దరి పెళ్లికి  కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో పాటు పలువురు పాకిస్తాన్‌ క్రికెటర్‌లు హాజరయ్యారు.

ఇక తన కూమర్తె నిఖా అనంతరం షాహిద్ ఆఫ్రిది భావోద్వేగానికి లోనయ్యాడు. "దేవుడి ఆశీర్వాదాలతో ఇంటి పూదోటలో వికసించే.. అత్యంత అందమైన పూబోణి కూతురు. తనతో కలిసి మనస్ఫూర్తిగా నవ్వగలం, తన కలలను ప్రేమించగలం. తను ఉంటే చాలంతే! ఓ తండ్రిగా నా బిడ్డ పట్ల నా బాధ్యత నెరవేర్చా. షాహిన్‌ ఆఫ్రిదిని తనకు భర్తగా ఇచ్చాను. మీ ఇద్దరికీ శుభాభినందనలు’’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక 2021 జులైలో శ్రీలంక టూర్ లో గాయపడ్డ షాహీన్.. ఆసియా కప్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ లో ఫిట్‌నెస్‌ లేకున్నా ఆడిన అతడు తర్వాత మళ్లీ గాయపడి  జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆఫ్రిది ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు.

అతడు ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ సారథ్యం వహించనున్నాడు.ఇక 22 ఏళ్ల షాహీన్ తన కెరీర్ లో ఇప్పటివరకు  25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.  టెస్టులలో 99, వన్డేలలో 62, టీ20లలో 58 వికెట్లు పడగొట్టాడు.

చదవండిసొంతగడ్డపై భారత జట్టు బలహీనం.. ఆసీస్‌దే ట్రోఫీ: టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top