రిత్విక్‌ జోడీకి రొవరెటో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ | Rithvik and Jodi win the Rovereto Open ATP Challenger title | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ జోడీకి రొవరెటో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌

Nov 24 2024 4:05 AM | Updated on Nov 24 2024 4:05 AM

Rithvik and Jodi win the Rovereto Open ATP Challenger title

రొవరెటో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌ విభాగంలో రిత్విక్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట చాంపియన్‌గా నిలిచింది. 

ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శనివారం రిత్విక్‌–బాలాజీ జోడీ 6–3, 2–6, 12–10తో థియో అరిబెగ్‌ (ఫ్రాన్స్‌)–ఫ్రాన్సిస్కో కబ్రాల్‌ (పోర్చుగల్‌) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రితి్వక్‌–బాలాజీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌ మనీ, 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రిత్విక్‌ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.  

Advertisement
 
Advertisement
Advertisement