రాణి రాంపాల్‌కే మహిళల హాకీ జట్టు పగ్గాలు | Rani Rampal To Lead Indian Womens Hockey Team | Sakshi
Sakshi News home page

రాణి రాంపాల్‌కే మహిళల హాకీ జట్టు పగ్గాలు

Jun 22 2021 10:45 AM | Updated on Jun 22 2021 10:45 AM

Rani Rampal To Lead Indian Womens Hockey Team - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్‌ఐ కెప్టెన్‌  పేరును వెల్లడించలేదు.

వైస్‌ కెప్టెన్‌లుగా గోల్‌కీపర్‌ సవిత, దీప్‌ గ్రేస్‌ ఎక్కా వ్యవహరిస్తారు. ‘ఒలింపిక్స్‌లో జట్టును నడిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని భారత్‌ తరఫున 241 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్‌ చేసిన రాణి వ్యాఖ్యానించింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement