చెలరేగిన వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌ Nicholas Pooran, Rovman Powell Propel West Indies To 180-4 vs England. Sakshi
Sakshi News home page

T20 WC 2024: చెలరేగిన వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌

Published Thu, Jun 20 2024 8:07 AM | Last Updated on Thu, Jun 20 2024 9:43 AM

Nicholas Pooran, Rovman Powell Propel West Indies To 180-4 vs England

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

విండీస్‌ ఓపెనర్లు చార్లెస్‌, కింగ్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌ వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్‌ గాయం కారణంగా రిటైర్డ్‌హట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌.. చార్లెస్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్‌ ఔటయ్యాక కెప్టెన్‌ రావ్‌మెన్‌ పావెల్‌ సైతం తన బ్యాట్‌కు పని చెప్పాడు.

విండీస్‌ బ్యాటర్లలో చార్లెస్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పూరన్‌(36), పావెల్‌(36), రుథర్‌ఫార్డ్‌(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అర్చర్‌, కుర్రాన్‌, మొయిన్‌ అలీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement