అంజూ జార్జ్‌ రికార్డు బద్దలు | long jumper Ancy Sojan smashed the 22 year old national record | Sakshi
Sakshi News home page

అంజూ జార్జ్‌ రికార్డు బద్దలు

Jun 28 2026 12:40 AM | Updated on Jun 28 2026 12:40 AM

long jumper Ancy Sojan smashed the 22 year old national record

భువనేశ్వర్‌: భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం అంజూ బాబీ జార్జ్‌ లాంగ్‌జంప్‌లో 22 ఏళ్ల క్రితం నెలకొల్పిన జాతీయ రికార్డు బద్దలైంది. భారత యువ లాంగ్‌ జంపర్‌ ఆన్సీ సోజన్‌ ఈ ఘనతను నమోదు చేసింది. నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లో కేరళకు చెందిన 25 ఏళ్ల ఆన్సీ 6.88 మీటర్ల దూరం లంఘించింది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో అంజూ  జార్జ్‌ 6.83 మీటర్ల దూరం దూకి భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఇప్పుడు ఆన్సీ 0.05 మీటర్ల తేడాతో దానిని అధగమించి కొత్త చరిత్ర సృష్టించింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement