అమెరికా బృందం పతాకధారిగా లెబ్రాన్‌ జేమ్స్‌ | LeBron James is the flag bearer of the American team | Sakshi
Sakshi News home page

అమెరికా బృందం పతాకధారిగా లెబ్రాన్‌ జేమ్స్‌

Jul 23 2024 4:04 AM | Updated on Jul 23 2024 12:42 PM

LeBron James is the flag bearer of the American team

పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంబోత్సవంలో పాల్గొనే అమెరికా క్రీడాకారుల బృందానికి పతాకధారిగా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం లెబ్రాన్‌ జేమ్స్‌ వ్యవహరిస్తాడు. 39 ఏళ్ల లెబ్రాన్‌ నాలుగోసారి ఒలింపిక్స్‌ క్రీడల్లో పోటీపడనున్నాడు. 

6 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న లెబ్రాన్‌ 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం... 2008 బీజింగ్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లండన్‌ గేమ్స్‌ తర్వాత లెబ్రాన్‌ రియో, టోక్యో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. ఎన్‌బీఏ లీగ్‌ చరిత్రలో అత్యధిక పాయింట్లు (48,177) సాధించిన ప్లేయర్‌గా లెబ్రాన్‌ రికార్డు నెలకొల్పాడు. 

Advertisement
 
Advertisement
Advertisement