Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి... | Kamindu Mendis make his IPL debut | Sakshi
Sakshi News home page

Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...

Apr 4 2025 4:10 AM | Updated on Apr 4 2025 8:51 AM

Kamindu Mendis make his IPL debut

శ్రీలంక ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కుడి చేత్తో ఆఫ్‌ స్పిన్, ఎడమ చేత్తో లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగల నైపుణ్యం అతని సొంతం. దీనిని అతను తన తొలి ఓవర్లోనే చూపించాడు. ఈ ఓవర్లో కుడి చేతి వాటం బ్యాటర్‌ రఘువంశీకి లెఫ్టార్మ్‌ స్పిన్‌తో 3 బంతులు వేసిన మెండిస్‌... ఎడంచేతి వాటం బ్యాటర్లు వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్‌లకు ఆఫ్‌స్పిన్‌తో మరో 3 బంతులు వేశాడు. 

ఈ క్రమంలో రఘువంశీ వికెట్‌ కూడా దక్కింది. అయితే అతడిని సమర్థంగా వాడుకోవడంలో రైజర్స్‌ కెప్టెన్ కమిన్స్‌ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ కమిందు బౌలింగ్‌ చేయగా... ఆ తర్వాత పేసర్ల బౌలింగ్‌లో కేకేఆర్‌ విరుచుకుపడుతున్న సమయంలోనూ కనీసం మరో ఓవర్‌ కూడా వేయించకుండా ఒక ఓవర్‌కే పరిమితం చేశాడు. బ్యాటింగ్‌లో ‘0’ వద్ద రసెల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కమిందు... రసెల్‌ ఓవర్లోనే 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement