జుగ్‌రాజ్‌ హ్యాట్రిక్‌ | Jugraj Singh stars in India 10-2 win against hosts South Africa | Sakshi
Sakshi News home page

జుగ్‌రాజ్‌ హ్యాట్రిక్‌

Feb 10 2022 5:06 AM | Updated on Feb 10 2022 5:06 AM

Jugraj Singh stars in India 10-2 win against hosts South Africa - Sakshi

పాచెఫ్‌స్ట్రోమ్‌ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10–2 గోల్స్‌ తేడాతో నెగ్గింది. భారత్‌ తరఫున రెండో మ్యాచ్‌ ఆడుతున్న ‘డ్రాగ్‌ ఫ్లికర్‌’ జుగ్‌రాజ్‌ సింగ్‌ మూడు గోల్స్‌తో (4వ, 6వ, 23వ ని.లో) ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. గుర్‌సాహిబ్జిత్‌ సింగ్‌ (24వ, 36వ ని.లో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (25వ, 58వ ని.లో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (2వ ని.లో), అభిషేక్‌ (12వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (27వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. మంగళవారం ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5–0తో నెగ్గిన సంగతి విదితమే.  

Advertisement
 
Advertisement
Advertisement