IPL 2025 DC vs RR: సూపర్ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ | IPL 2025: Delhi capitals vs Rajasthan royals Live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 DC vs RR: సూపర్ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ

Apr 16 2025 7:04 PM | Updated on Apr 17 2025 12:08 AM

IPL 2025: Delhi capitals vs Rajasthan royals Live updates and highlights

PC: BCCI/IPL.com

Delhi capitals vs Rajasthan royals Live updates:
సూపర్ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం తేలింది. ఈ ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.

 మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన‌ సూప‌ర్ ఓవ‌ర్‌లో హెట్‌మైర్‌(5), రియాన్ పరాగ్‌(4) రాణించారు. అనంత‌రం 12 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం మూడు బంతుల్లోనే చేధించి విజ‌యాన్ని అందుకుంది. కేఎల్‌ రాహుల్ 7 ప‌రుగులు చేయ‌గా.. స్ట‌బ్స్ సిక్స‌ర్ కొట్టి త‌న జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.

 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు.

సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 11 ప‌రుగులు చేసింది. మిచెల్ స్టార్ బౌలింగ్‌లో రాజ‌స్తాన్ ర‌నౌట్ల రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది.
రాజ‌స్తాన్-ఢిల్లీ మ్యాచ్ టై.. 
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చడానికి అంపైర్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు.

దూకుడుగా ఆడుతున్న రాణా..
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల‌ న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(50), జురెల్‌(13) ఉన్నారు. రాజ‌స్తాన్ విజ‌యానికి 18 బంతుల్లో 31 ప‌రుగులు కావాలి.

రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌..
జైశ్వాల్‌ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 51 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల‌ న‌ష్టానికి 132 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(34), జురెల్‌(3) ఉన్నారు. 

రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌..
రియాన్ ప‌రాగ్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన ప‌రాగ్.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(50), నితీష్ రాణా(11) ఉన్నారు.

సంజూ శాంస‌న్ రిటైర్డ్ హార్ట్‌..
రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్(31) రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పక్కటెముకల గాయం కార‌ణంగా మైదానాన్ని శాంస‌న్ వీడాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్ట‌పోకుండా 76 ప‌రుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(33), పరాగ్‌(8) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న రాజ‌స్తాన్‌..
189 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాయ‌ల్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 45 ప‌రుగ‌లు చేసింది. క్రీజులో సంజూ శాంస‌న్‌(16), జైశ్వాల్‌(26) ఉన్నారు.

చెల‌రేగిన ఢిల్లీ బ్యాట‌ర్లు.. రాజ‌స్తాన్ టార్గెట్ ఎంతంటే?
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రాహుల్(38), స్ట‌బ్స్‌(34), అక్ష‌ర్ ప‌టేల్‌(34) రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ రెండు వికెట్లు ప‌డగొట్ట‌గా.. తీక్ష‌ణ‌, హ‌స‌రంగ త‌లా వికెట్ సాధించారు.

అక్ష‌ర్ ప‌టేల్ ఔట్‌..
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. 34 ప‌రుగుల‌తో క్విక్ ఇన్నింగ్స్ ఆడిన అక్ష‌ర్ పటేల్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఢిల్లీ మూడో వికెట్ డౌన్‌..
కేఎల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన రాహుల్‌.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 98 ప‌రుగులు చేసింది.

10 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోర్‌: 76/2
10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 76 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్‌(40), కేఎల్ రాహుల్‌(28) ఉన్నాడు.
ఢిల్లీ రెండో వికెట్ డౌన్‌..
క‌రుణ్ నాయ‌ర్(0) రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లో క‌రుణ్ నాయ‌ర్ రనౌట‌య్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ రెండు వికెట్ల న‌ష్టానికి 37  ప‌రుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గ‌ర్క్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన మెక్‌గ‌ర్క్‌.. జోఫ్రా అర్చ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 34 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్‌(25), క‌రుణ్ నాయ‌ర్‌(0) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజ‌స్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగాయి.

తుది జ‌ట్లు
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement