ప్రతీకా సూపర్‌ సెంచరీ.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం | India womens defeat Zimbabwe by 9 wickets in 1st Odi | Sakshi
Sakshi News home page

IND vs ZIM: ప్రతీకా సూపర్‌ సెంచరీ.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

Oct 23 2026 7:44 PM | Updated on Oct 23 2026 7:58 PM

India womens defeat Zimbabwe by 9 wickets in 1st Odi

వడోదర వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో కేవలం 197 పరుగులకే కుప్పకూలింది. 

జింబాబ్వే బ్యాటర్లలో బీలవ్డ్ బీజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మావుంగా(29), ముపాచిక్వా(25) రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు  క్రాంతి గౌడ్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.

ప్రతీకా, షఫాలీ వర్మ మెరుపులు
అనంతరం 198 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (96 బంతుల్లో 15 ఫోర్లతో 100) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. షఫాలీ వర్మ(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) ఆర్ధ శతకంతో మెరిసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే అక్టోబర్ 25న ఇదే వేదికలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement