Squash Championship: పాకిస్తాన్‌పై భారత్‌ విజయం  | India Beat Pakistan In Asia Sqaush Championship | Sakshi
Sakshi News home page

Squash Championship: పాకిస్తాన్‌పై భారత్‌ విజయం 

Dec 2 2021 7:41 AM | Updated on Dec 2 2021 7:54 AM

India Beat Pakistan In Asia Sqaush Championship  - Sakshi

ఆసియా స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం భారత జట్టు 2–1తో పాకిస్తాన్‌ జట్టును ఓడించింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ 9–11, 7–11, 11–1, 11–7, 11–8తో తయ్యబ్‌ అస్లమ్‌ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అంతకుముందు మరో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–0తో జపాన్‌పై గెలిచింది. ప్రస్తుతం భారత్‌ పూల్‌ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement