IND vs WI: అతడికి మరో అవకాశం.. భారత తుదిజట్టు ఇదే! | IND vs WI 4th T20I: Want to see him get 1 more chance: Pujara IND Playing 11 | Sakshi
Sakshi News home page

IND vs WI: అతడికి మరో అవకాశం.. భారత తుదిజట్టు ఇదే!

Oct 13 2026 4:46 PM | Updated on Oct 13 2026 5:05 PM

IND vs WI 4th T20I: Want to see him get 1 more chance: Pujara IND Playing 11

భారత జట్టు (PC: BCCI X)

టీమిండియా టీ20 సిరీస్‌ విజయంపై కన్నేసింది. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉప్పల్‌ పిచ్‌ ఎలా ఉండబోతుందన్న అంశం మీదే జట్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డాడు.

ఎలాంటి మార్పులు వద్దు
అదే విధంగా భారత తుదిజట్టు కూర్పు గురించి కూడా పుజారా మాట్లాడాడు. ‘‘టాపార్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండకూడదనే కోరుకుంటున్నా. సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా వస​ఆతరు. ఇషాన్‌ కిషన్‌ మూడు, శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు, తిలక్‌ వర్మ ఐదో స్థానంలో యథావిధిగా వస్తారు.

నితీశ్‌ రెడ్డికి మరో అవకాశం 
ఇక ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. అతడు గత మ్యాచ్‌లో గొప్పగా రాణించారు. కాబట్టి నితీశ్‌ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. అతడు ఆరో స్థానంలో వస్తాడు.

నమన్‌ ధీర్‌ కూడా గొప్పగా ఆడుతున్నాడు. ఏడో స్థానంలో అతడు కొనసాగుతాడు. అక్షర్‌ పటేల్‌ ఎనిమిదో స్థానంలో వస్తాడు. ఫాస్ట్‌బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ తొమ్మిదో స్థానంలో ఆడతాడు. మయాంక్‌ యాదవ్‌ బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కాబట్టి అతడిని కూడా ఆడించాలి. 

అంతా వికెట్‌ దయ
అయితే, హైదరాబాద్‌ పిచ్‌ ఎలా ఉంటుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. వికెట్‌ ఆధారంగానే ప్రిన్స్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది’’ అని పుజారా చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి పుజారా ఎంచుకున్న భారత తుదిజట్టు
సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నమన్‌ ధిర్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌/కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్‌ అవ్వండి: యువీ, గంభీర్‌ కెరీర్లు అలా ఖతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement