భారీ విజయంతో భారత్‌ బోణీ | Defending champion Indian team scores a huge win in hockey tournament | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో భారత్‌ బోణీ

Nov 28 2024 4:05 AM | Updated on Nov 28 2024 4:05 AM

Defending champion Indian team scores a huge win in hockey tournament

మస్కట్‌ (ఒమన్‌): ఆసియా కప్‌ జూనియర్‌ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 11–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున అరిజిత్‌ సింగ్‌ హుండల్‌ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్‌ సింగ్‌ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్‌ ఆనంద్‌ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు.

దిల్‌రాజ్‌ సింగ్‌ (21వ నిమిషంలో), ముకేశ్‌ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్‌ తివారీ (10వ నిమిషంలో), రోహిత్‌ (29వ నిమిషంలో), అర్‌‡్షదీప్‌ సింగ్‌ (8వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement