తండ్రైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. అందుకే ఆసీస్‌ టూర్‌కు దూరం | Axar Patel welcomes baby boy, reveals name, know its special meaning | Sakshi
Sakshi News home page

తండ్రైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. అందుకే ఆసీస్‌ టూర్‌కు దూరం

Dec 24 2024 8:30 PM | Updated on Dec 24 2024 8:30 PM

Axar Patel welcomes baby boy, reveals name, know its special meaning

టీమిండియా స్టార్ క్రికెటర్ అక్ష‌ర్ ప‌టేల్(Axar Patel) తండ్రయ్యాడు. అత‌డి భార్య మేహా పండింటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని అక్ష‌ర్ ప‌టేల్ మంగ‌ళవారం(డిసెంబ‌ర్ 24) సోషల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. తన కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫోటోను ఈ గుజరాతీ షేర్ చేశాడు. డిసెంబ‌ర్ 19న త‌మ మొదటి బిడ్డకు బిడ్డకు స్వాగతం పలికినట్లు అక్షర్ వెల్లడించాడు. అదే విధంగా తమ బిడ్డకు హక్ష్ పటేల్ అని పేరు పెట్టినట్లు భారత ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.

కాగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఈ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మిగిలిన రెండు టెస్టులకు అతడి స్ధానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేస్తారని అంతా భావించారు. కానీ అతడు పితృత్వ సెలవులో ఉండడంతో సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.

ఈ విషయాన్ని బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ధ్రువీకరించాడు. ఇక అశ్విన్ స్ధానాన్ని ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కోటియన్‌తో భర్తీ చేశారు. అక్షర్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు.

Advertisement
 
Advertisement
Advertisement