రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటిన రెన్షా.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం | Australia set 421 runs target to south africa in durban test | Sakshi
Sakshi News home page

రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటిన రెన్షా.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం

Oct 12 2026 6:25 PM | Updated on Oct 12 2026 6:25 PM

Australia set 421 runs target to south africa in durban test

source: X

డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. 314-6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన ఆ జట్టు, సౌతాఫ్రికా ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకం బాదిన మ్యాట్‌ రెన్షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ (82) సత్తా చాటాడు. జట్టులో ప్రతి ఆటగాడు తలో చేయి వేయడంతో ఆసీస్‌ ప్రత్యర్దికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

మ్యాడిసన్‌ 48, హెడ్‌ 11, లబూషేన్‌ 37, స్టీవ్‌ స్మిత్‌ 27, క్యారీ 24, కమిన్స్‌ (32 నాటౌట్‌), వెబ్‌స్టర్‌ 39 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జే, మహారాజ్‌ తలో 2, యాన్సెన్‌, హార్మర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు చివరి సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలవాలంటే ఇంకా 414 పరుగులు చేయాలి.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లు సత్తా చాటడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. 

49 పరుగులు చేసిన డేవిడ్‌ బెడింగ్హమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. మార్క్రమ్‌ (37), స్టబ్స్‌ (32), ముల్దర్‌ (30), వెర్రిన్‌ (13), యాన్సెన్‌ (26), హార్మర్‌ (35 నాటౌట్‌), కేశవ్‌ మహారాజ్‌ (34), నోర్జే (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 3 వికెట్లు తీయగా.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, లియోన్‌ తలో 2, వెబ్‌స్టర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు మ్యాట్‌ రెన్షా (190) వీరోచిత  శతకం బాదడంతో ఆస్ట్రేలియా 390 పరుగులు చేసింది. రెన్షాకు కమిన్స్‌ (43), లియోన్‌ (27), లబూషేన్‌ (37), స్టీవ్‌ స్మిత్‌ (25) సహకరించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ముల్దర్‌ 4, యాన్సెన్‌ 3, నోర్జే 2, హార్మర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

ఇదీ చదవండి: సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. చ‌రిత్ర సృష్టించిన ఆసీస్ బౌల‌ర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement