source: X
త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వేర్వేరు ఇంగ్లండ్ జట్లను ఇవాళ ప్రకటించారు. వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ కొనసాగగా.. స్టార్ ప్లేయర్లు జోఫ్రా ఆర్చర్, యువ ఆటగాడు జాకబ్ బేతెల్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆర్చర్ పాక్‌లో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌కు విశ్రాంతి తీసుకోగా.. బేతెల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వస్తున్నాడు.
ఇటీవల ఎడమ తొడ కండరానికి శస్త్రచికిత్స చేయించుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆసీస్ పర్యటనకు అందుబాటులో లేడు. మోకాలి గాయం కారణంగా సాకిబ్ మహమూద్‌కు కూడా అవకాశం దక్కలేదు.
వన్డే సిరీస్ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, జోష్ టంగ్ దూరంగా ఉండనున్నారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు పర్యటనకు ముందు ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని నియంత్రించేందుకు ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
టీ20 జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లు
టీ20 జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు. థామస్ ర్యూ, ఎడ్డీ జాక్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 18 ఏళ్ల ర్యూ ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించి ఫైనల్‌కు చేర్చాడు.
గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అన్యూరిన్ డొనాల్డ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, ల్యూక్ వుడ్‌కు కూడా పిలుపు అందింది.
ఇంగ్లండ్ వన్డే జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.
ఇంగ్లండ్ టీ20 జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కరన్, లియామ్ డాసన్, అన్యూరిన్ డొనాల్డ్, ఎడ్డీ జాక్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, థామస్ ర్యూ, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.
కాగా, హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఆసీస్ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
షెడ్యూల్
ఇంగ్లండ్ ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ 7న పెర్త్‌లోని వాకా మైదానంలో జరిగే సన్నాహక మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
తొలి వన్డే: నవంబర్ 13, పెర్త్
రెండో వన్డే: నవంబర్ 15, అడిలైడ్
మూడో వన్డే: నవంబర్ 18, హోబార్ట్
తొలి టీ20: నవంబర్ 21, మెల్‌బోర్న్
మిగిలిన నాలుగు టీ20లు గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్, సిడ్నీ, కాన్‌బెర్రా వేదికలుగా నవంబర్ 24, 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో జరుగనున్నాయి.
ఇదీ చదవండి: పాక్‌తో టెస్ట్‌లకు లంక జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్ బౌలర్‌కు పిలుపు


