ఇదేమి చెత్త బ్యాటింగ్‌రా బాబు.. ఫుల్ టాస్ బాల్‌కు కూడా! వీడియో | Aiden Markram Poor form Continues In Ipl 2024 | Sakshi
Sakshi News home page

#Markram: ఇదేమి చెత్త బ్యాటింగ్‌రా బాబు.. ఫుల్ టాస్ బాల్‌కు కూడా! వీడియో

Apr 26 2024 12:07 AM | Updated on Apr 26 2024 12:07 AM

Aiden Markram Poor form Continues In Ipl 2024

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్‌క్రమ్ తన పేలవ ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మార్‌క్రమ్ నిరాశపరిచాడు. కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన మార్‌క్ర‌మ్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించ‌లేక‌పోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న మార్‌క్ర‌మ్‌.. కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

స్పిన్న‌ర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఫుల్ టాస్ బంతికి వికెట్ల ముందు మార్‌క్ర‌మ్ దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్న‌ప్ప‌టికి క్లియ‌ర్ ప్లంబ్‌(ఎల్బీ)గా తేలింది. ఈ క్ర‌మంలో అత‌డిని నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఫుల్ టాస్ బాల్ కూడా ఆడ‌లేవా అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరి కొంతమంది  వరుసగా విఫలమవతున్నప్పటికి మార్‌క్రమ్‌కు ఛాన్స్‌ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో గ్లెన్‌ ఫిలిప్స్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్‌క్రమ్‌.. 27.83 స‌గ‌టుతో 167 ప‌రుగులు చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement