Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్‌ రూమ్‌

Published Wed, Mar 27 2024 7:35 AM

మాట్లాడుతున్న వెంకట్రాంరెడ్డి  - Sakshi

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ క్రాంతి మంగళవారం తెలి పారు. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉన్నట్లయితే 08455276155 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

తొలివిడత

ర్యాండమైజేషన్‌ పూర్తి

సంగారెడ్డి టౌన్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్టు కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీవీసీ హాల్లో ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న రీత్యా 8,363 మందిని మొదటి విడత రాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బందిని కేటాయించామన్నారు. వీరికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, రెవెన్యూ అధికారి పద్మజారాణి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ క్రాంతి అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్‌బ్యాలెట్‌ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఎవరికి వర్తిస్తుందనే స్పష్టమైన అవగాహన అధికారులు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల రోజున విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బందికి ఫారం 12 అందించాలన్నారు. సీవిజిల్‌ యాప్‌, 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ను ఉపయోగించి రాజకీయ పార్టీ నాయకుల ప్రలోభాలను సమాచారం అందించాలన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి టౌన్‌: జిలాల్లో గ్రూప్‌ 1, 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల ఫౌండేషన్‌ కోర్సుకు గానూ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని, ఈ నెల 28 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్‌ రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. డిగ్రీ మార్కుల మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94404–78004, 98499–07051 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

సొంత నిధులతో ట్రస్టు

బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి

వెంకట్రాంరెడ్డి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్‌ ఎంపీగా గెలిపిస్తే రూ.వంద కోట్ల సొంత నిధులతో పీవీఆర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి.. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత నిధులతో ఫంక్షన్‌ హాలులు కట్టించి పేదలకు ఉచితంగా వేడుకలను చేసుకునేందుకు అవకాశం కల్పిస్తానన్నారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన మెదక్‌ లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మద్దతుతోనే సిద్దిపేట కలెక్టర్‌గా ఐదేళ్లు ఒకే చోటా పని చేయగలిగానన్నారు. తాను రాజకీయాల్లోకి డబ్బుల కోసం రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని స్పష్టం చేశారు. 25 ఏళ్ల పాటు జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, గ్రూప్‌–1 ఆఫీసర్‌గా సేవ చేశానని, ఎంతో మంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ మనిషిగా ఉంటానని, ఎంపీగా ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫారూక్‌ హుస్సేన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, నాయకులు రాజేశ్వర్‌రావుదేశ్‌పాండే, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement