Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం సాధ్యం

Published Sat, Nov 18 2023 7:48 AM

 తాటిపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌  - Sakshi

వట్‌పల్లి(అందోల్‌): బీఆర్‌ఎస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అందోల్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. శుక్రవారం పోతులబోగుడాలోని తన నివాసంలో అల్లాదుర్గ్‌ మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కార్యకర్తలతో పాటు శివాజీ యూత్‌ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రాయికోడ్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ విఠల్‌, అల్లాదుర్గ్‌ మండల పార్టీ ప్రధానకార్యదర్శి రామాగౌడ్‌, ఎస్సీసెల్‌ అద్యక్షుడు పెంటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తో సుపరిపాలన

టేక్మాల్‌(మెదక్‌): బీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన అందుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రాహుల్‌ కిరణ్‌ అన్నారు. అందోల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ గెలుపు కోసం శుక్రవారం ఆయన మండలంలోని వెల్పుగొండ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగంలో ఉంచిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రజల మధ్యలో ఉండే క్రాంతికిరణ్‌ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వీరప్ప, చింత రవి, నారాయణ, పౌలు, రమేష్‌ పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పథకాల అమలు

మునిపల్లి(అందోల్‌): సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తాటిపల్లి, పిల్లోడి, మన్‌సాన్‌పల్లి, మేళసంగ్యం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు తాటిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పిల్లోడిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కువ చేస్తే తోకలు కత్తిరిస్తానని క్రాంతి కిరణ్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ మీనాక్షి, సాయికుమార్‌, విజయ్‌ కుమార్‌, శశికుమార్‌, నవాజ్‌రెడ్డి, బక్కారెడ్డి పాల్గొన్నారు.

మరోసారి ఆశీర్వదించండి

రేగోడ్‌(మెదక్‌): అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను మరోసారి గెలిపించి ఆశీర్వదించాలని ఆయన సతీమణి పద్మావతి కోరారు. చౌదర్‌పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆమె ఇంటింటి పచ్రారం చేశారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మి మోసపోయి గోస పడొద్దని ప్రజలను కోరారు.

ఆ పార్టీ అందోల్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌

Advertisement

What’s your opinion

Advertisement