ప్రేమ పేరిట డబ్బులు వసూలు | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరిట డబ్బులు వసూలు

Published Sun, Mar 24 2024 1:45 AM

-

● యువకులతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో రికార్డు ● తర్వాత బ్లాక్‌మెయిల్‌ ● జగిత్యాలలో ఓ మహిళ నిర్వాకం ● ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న బాధితులు

జగిత్యాల క్రైం: ఓ మహిళ డబ్బు, పలుకుబడి ఉన్నవారితో స్నేహం చేస్తూ, ప్రేమ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవ్వకపోతే వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో నివసించే ఓ మహిళ పలువురు యువకులతో స్నేహం చేసింది. ప్రేమాయాణం సాగించి, ఇంటికి పిలిపించుకొని, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో రికార్డు చేసింది. తర్వాత తన అవసరాల కోసం డబ్బులు అడగడం ప్రారంభించింది. అడిగినప్పుడు డబ్బు ఇవ్వకున్నా, రమ్మన్నప్పుడు వెళ్లకున్నా ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది. ఇలా గత ఆరు నెలల్లో ఆమె బాధితులు 6 నుంచి 8 మంది ఉన్నట్లు తెలిసింది. ఆమె వేధింపులు భరించలేక ఒకరిద్దరు తమ సెల్‌ఫోన్‌ నంబర్లు మార్చుకోగా మిగతావారు ఆమె చెప్పింది చేస్తూ నిత్యం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మహిళ మోజులో పడినవారు ఆమె వేధింపులను భరిస్తున్నారు. కానీ, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. బాధితుల్లో ఒకరిద్దరి భార్యలకు ఈ విషయం తెలిసి, ఆ మహిళతో గొడవపడినట్లు తెలిసింది.

Advertisement
Advertisement