బైండోవర్‌ అంటే.. | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ అంటే..

Published Thu, Nov 16 2023 1:52 AM

-

సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల సమయంలో పోలీసుల నోట తరచూ వినిపించే పదం శ్రీబైండోవర్‌శ్రీ. చాలామంది ఓటర్లకు బైండోవర్‌ అంటే ఏమిటో తెలియదు. బైండోవర్‌ అంటే బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పాతనేరస్తులను అదుపులోకి తీసుకుంటారు. రౌడీషీటర్లు, సారా తయారీదారులు, అమ్మకదారులు, బెల్ట్‌షాపుల నిర్వాహకులు, ఇతర కేసుల్లోని నిందితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తారు. అనంతరం వారిని తహసీల్దార్‌, ఆర్డీవోల ఎదుట హాజరుపరుస్తారు. సీఆర్‌పీసీ – 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్‌ చేసి.. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తారు. వీరు తహసీల్దార్‌ వద్ద బాండ్‌ పేపర్‌పై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. కొంత మొత్తం నగదు లేదా స్థిరాస్తి ష్యూరిటీ చూపించాలి. బైండోవరైన వ్యక్తులు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ష్యూరిటీ పెట్టిన సొమ్ము నుంచి వసూలు చేస్తారు. వీరు ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ అధీనంలోనే ఉంచుకుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement