సాక్షి, చెన్నై : ధారాపురం ఉప ఎన్నికలలో పోటీచేసిన టీవీకే అభ్యర్థి సత్యభామా వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ వీడియో ఎన్నికల వేళ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె తాను గత ఎన్నికలలో రూ. 31 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అయితే, ఇది మార్ఫింగ్ అని ఆమె స్పష్టం చేశారు. తన విజయ అవకాశాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే కొందరు ఈ అసత్య ప్రచారానికి తెరలేపారని, ఈ నకిలీ వీడియోపై ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
అయితే డీఎంకే ఒక అడుగు ముందుకు వేసి సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ఈ వీడియో గురించి వివరించారు. ఆమె గత ఎన్నికలో 31 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా పేర్కొని ఉన్న నేపథ్యంలో ఇది పూర్తిగా అనర్హత వేటు పరిధిలోకి వస్తుందని సూచించారు. అభ్యర్థికి ఎన్నికల కమిషన్ నిర్ణయించిన గరిష్ట పరిమితికంటే అత్యధికంగా ఖర్చు పెట్టినట్టుగా ఆమె స్వయంగా అంగీకరించి ఉన్న దృష్ట్యా, తక్షణ విచారణతో అనర్హత వేటు వేయాలని కోరారు.
అలాగే 3 సంవత్సరాల పాటుగా ఆమె ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సీపీఎం కార్యదర్శి షణ్ముగం తరపున సైతం ఎన్నికల కమిషన్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: రోజుకు 18 గంటలు పని.. సీఎం బిజీ బిజీ: లక్ష్మి


