టీడీపీలో సీట్ల బేరం.. జెడ్పీ చైర్మన్‌ 50 కోట్లు.. ఎంపీపీకి ఎంతంటే? | Nellore ZP Chairman Post Allegedly Put Up For Rs 50 Crore By TDP Amid Claims Of Crores Being Charged For Local Body Election Tickets | Sakshi
Sakshi News home page

టీడీపీలో సీట్ల బేరం.. జెడ్పీ చైర్మన్‌ 50 కోట్లు.. ఎంపీపీకి ఎంతంటే?

Oct 24 2026 11:15 AM | Updated on Oct 24 2026 12:20 PM

Nellore ZP Chairman Seat Rs50 Crore To TDP

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నోట్ల కట్టలు కురిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎ మ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక కావడం కోసం పారీ్టకి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఫండ్‌ సమరి్పంచుకున్నారు. వాటిని రాబట్టుకునేందుకు పదవిని బట్టి.. రేటు నిర్ణయించి బహిరంగ వేలం వేసినట్లు జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ చర్చ నడుస్తోంది. అధికారంలో ఉంది.. టీడీపీ కావడంతో.. ఎన్ని అడ్డదారులైన తొక్కి కచ్చితంగా పదవులు కట్టబెట్టుతుందనే ధీమా ఆయా పదవుల ఆశావహులు బలంగా కనిపిస్తోంది. 

అడ్డదారుల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కార్పొరేటర్‌ నుంచి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ పదవులకు రేట్లు పెట్టి ఓపెన్‌ ఆక్షన్‌ వేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్‌ రూ.50 లక్షలు ముట్టజెప్పితేనే.. బీఫారం ఇచ్చినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జలదంకి ఎంపీపీ సీటుకు బహిరంగ వేలం పెడితే.. రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు వేలం నడిచినట్లు ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.  

రేటును బట్టి సీటు   
జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ లీడర్‌ కంటే డబ్బు సంచుల మూటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేందుకు సీట్లను అంగడి సరుకులా మార్చేసుకున్నారు. సీటు డిమాండ్‌ బట్టి తూకం పెరిగే కొద్దీ అభ్యర్థులను మార్చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో సీట్ల అమ్మకాల గోల రగడగా మారింది. 

అన్‌ రిజర్వుడ్‌ వచ్చిన సీట్లకు మరింత డిమాండ్‌ పెరగడంతో డబ్బు సంచుల మూటల తూకం బట్టి కేటాయింపులు చేశారంటూ ఆ పార్టీ నేతలే ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. జలదంకి ఎంపీపీ సీటు బహిరంగా వేలం వ్యవహారం విని ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే.. ఉదయగిరి ఎంపీపీ సీటుకు ఓపెన్‌ ఆక్షన్‌ పెట్టి.. స్థానిక ఎమ్మెల్యే పాట రూ.50 లక్షలతో ప్రారంభించారంట. మరొకరు రూ.కోటిన్నర ఇస్తానంటూ ముందుకు రావడంతో అక్కడ అభ్యర్థిత్వం మారిపోయింది. వింజమూరు జెడ్పీటీసీ సీటు కూడా భలే హాట్‌గా మారింది. స్థానికంగా ఉన్న టీడీపీ సీనియర్‌ నేతకు గతంలో ఏఎంసీ సీటు ఆఫర్‌ ఇచ్చారు. అందుకుగాను కొంత నగదు బదిలీ జరిగిందని ప్రచారం ఉంది.

 కానీ అప్పట్లో  ఏఎంసీ సీటు బీజేపీకి కేటాయించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ సీటు ఆఫర్‌ చేశారని తెలిసింది. ప్రస్తుతం అన్‌ రిజర్వుడ్‌ కావడంతో స్థానిక టీడీపీ నేత నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ ఆ సీటుకు డిమాండ్‌ రావడంతో ఉదయగిరి మండల స్థాయి నేత జెడ్పీ చైర్మన్‌ ఆశిస్తున్న వ్యక్తితో నామినేషన్‌ దాఖలు చేయించారు. డిమాండ్‌ను బట్టి రేటు పెంచుకుంటూ సీటు కేటాయించడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. వరికుంటపాడు జెడ్పీటీసీకి సంబంధించి బెంగళూరులో బిల్డర్‌గా ఉన్న వ్యక్తికి  సీటు ఇస్తానంటూ ఆశ పెట్టారు. కానీ తీరా బహిరంగ మార్కెట్‌లో రేటు పెరగడంతో మరో వ్యక్తికి కేటా యించినట్లుగా తెలుస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆశించి తూకంలో సరితూగలేక పోయారని ప్రచారంలో ఉంది.  

జెడ్పీ చైర్మన్‌ సీట్‌ భలే హాట్‌ గురూ  
జెడ్పీ చైర్మన్‌ సీటు టీడీపీలో హాట్‌ కేక్‌గా మారింది. జెడ్పీ చైర్మన్‌ పోటీ చేసే అభ్యర్థులు తూకంను బట్టి సీటు కేటాయింపు ఉండడంతో ఎమ్మెల్యేల మధ్య కుంపటి రగిలింది. ఆ పార్టీ అధిష్టానమే ఈ సీటుకు రూ.50 కోట్ల రేటు ఫిక్స్‌ చేయడంతో పలువురు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ రేసులో మాజీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులు, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డితో పాటు మరికొందరు పోటీపడుతున్నారు.    

ఇదీ చదవండి: ఇద్దరు టీడీపీ నేతలపై వేటు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement