ఆనంకు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ సవాల్‌ | Former Minister Anil Kumar Saval Anam Ramanarayana Reddy | Sakshi
Sakshi News home page

ఆనంకు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ సవాల్‌

Jun 25 2023 12:53 PM | Updated on Jun 25 2023 1:26 PM

Former Minister Anil Kumar Saval Anam Ramanarayana Reddy - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రాం నారాయణ రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. తాను ఆనం మీద పోటీ చేసి ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్‌ చేశారు.

ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్‌ అయ్యిందో.. అక్కడే క్లోజ్‌ చేస్తానన్నారు అనిల్‌. అలా చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని అనిల్‌ పేర్కొన్నారు. నెల్లూరు సిటీని తాను ఎంత అభివృద్ధి చేశానో.. టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు అనిల్‌. 

Advertisement
 
Advertisement
Advertisement